‘ఎల్‌.ఆర్‌.క్రియేషన్స్‌ ‘కనకం 916 కేడియమ్‌’ షూటింగ్‌ ప్రారంభం!!

Kanakam Movie Opening‘కేరాఫ్ కంచ‌రపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ హీరోగా ఎల్‌ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై క్ష్మణరావు బూరగాపు నిర్మిస్తోన్న చిత్రం ‘కనకం 916 కేడియమ్‌’. రాకేష్‌ పోతాప్రగడ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. వైశాఖి బోనం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాల‌కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా చిత్ర నిర్మాత క్ష్మణరావు బూరగాపు కెమేరా స్విచాన్‌ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో, డైర‌క్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్, ప్రముఖ నిర్మాతలు బివియస్‌ఎన్‌ప్రసాద్‌, రాజ్‌ కందుకూరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుడవ్వాల‌న్న తన తపన నచ్చి ఈ అవకాశం కల్పించాను. కేరాఫ్‌ కంచరపాలెంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌ భగత్‌ హీరోగా నటిస్తున్నారు. అలాగే టెక్నిషీయన్స్‌ కూడా ప్రతిభావంతులు పని చేస్తున్నారు. ఇందులో కమర్షియల్‌ అంశాల‌తో పాటు అంతర్లీనంగా మంచి సందే

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల‌ సమావేశంలో నిర్మాత ల‌క్ష్మణరావు బూరగాపు మాట్లాడుతూ…‘‘రాకేష్‌ ఓ రోజు వచ్చి కనకం స్టోరి లైన్‌ చెప్పాడు. తను చెప్పిన స్టోరీతో పాటు దర్శశం కూడా ఉంటూ అన్ని వర్గాల‌ ప్రేక్షకుకు నచ్చే సినిమా అవుతుందన్నారు.

దర్శకుడు రాకేష్‌ పోతాప్రగడ మాట్లాడుతూ…‘‘పలు చిత్రాల‌కు దర్శకత్వశాఖలో పని చేశాను. ఆ అనుభవంతో తొలిసారిగా ఈ సినిమా డైరక్షన్‌ చేస్తున్నా. పల్లెటూరి నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. డిసెంబర్‌ 26 నుంచి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన మా నిర్మాతకు మీడియా ముఖంగా ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

హీరో మోహన్‌ భగత్‌ మాట్లాడుతూ…‘‘కేరాఫ్‌ కంచరపాలెం చిత్రంతో నాకు నటుడుగా మంచి పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక మంచి కథ, కథనాల‌తో వచ్చి మా దర్శక నిర్మాతలు కలిసారు. వీరి పాషన్‌ నచ్చిఈ సినిమా చేస్తున్నా’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ వైశాఖి బోనం, సంగీత దర్శకుడు రాయల్‌ రాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నవీన్‌ సాగర్‌ గోరింట పాల్గొన్నారు.

సంపూర్ణేష్‌ బాబు, సీనియర్‌ నరేష్‌, పోసాని, జీవా, రవిబాబు, శివసూర్య, దేవీప్రసాద్‌, దీక్షితులు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రాయల్‌ రాజ్‌, సాహిత్యం: సురేష్‌ ఉపాధ్యాయ, సిహెచ్‌ గణేష్‌, శ్రీరామ్‌ తపస్వీ; కొరియోగ్రఫీ: సత్య, బాబి; స్టంట్స్‌:శంకర్‌; ఆర్ట్‌: అడ్డాల‌ పెద్దిరాజు; ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌:బి.చంద్రారెడ్డి; ఎడిటింగ్‌: తమ్మిరాజు; సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు; సమర్పణ: శ్రీమతి ల‌క్ష్మి; సహనిర్మాత: నవీన్‌ సాగర్‌ గోరింట; నిర్మాత: ల‌క్ష్మణరావు బూరగాపు; రచన-దర్శకత్వం:రాకేష్‌ పోతాప్రగడ.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KNsI4p

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly