రామ్‌చరణ్, బోయపాటి శ్రీను ల సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల

ఈ సందర్భంగా
అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “రామ్‌చరణ్‌గారు, బోయపాటిగారి కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో సినిమా చేస్తున్నామని ప్రకటించగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. డైరెక్టర్ కలయికలో సినిమా అనగానే సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వచ్చాయి. మెగాభిమానులు, ప్రేక్షకుల అంచనాలను ధీటుగా సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా నవంబర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ 9 నుండే డబ్బింగ్ ప్రారంభిస్తాం. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yGVQ8e
Comments
Post a Comment