ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ బాబు ?
ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటించనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బయోపిక్ వర్గాలు . ఎన్టీఆర్ కు కృష్ణ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే , అయితే అల్లూరి సీతారామరాజు చిత్ర సమయంలో ఎన్టీఆర్ కు కృష్ణ కు మద్య విబేధాలు ఏర్పడ్డాయి దాని తర్వాత ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశ సమయంలో కూడా కృష్ణ ని రాజకీయాల్లోకి ఆహ్వానించాడు కానీ కృష్ణ ససేమిరా అనడంతో ఎన్టీఆర్ ఒక్కడే రాజకీయాల్లోకి వెళ్ళాడు . ఆ తర్వాత కృష్ణ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసాడు అలాగే సినిమాలు కూడా తీసాడు .
అయితే ఈ బయోపిక్ లో కృష్ణ పాత్రని ఎలా చూపించబోతున్నారో ? పాత్ర నిడివి ఎంతో కానీ స్వయంగా బాలయ్య మహేష్ బాబు కి ఫోన్ చేసి కృష్ణ పాత్ర పోషించాలని అడిగాడట ! బాలయ్య స్వయంగా ఫోన్ చేయడంతో మహేష్ బాబు కొంత సమయం ఇవ్వండి ఆలోచించి చెబుతానని అన్నాడట . మహేష్ బాబు కనుక కృష్ణ పాత్ర పోషిస్తే మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు నందమూరి అభిమానులకు కూడా పండగే ! ఇక మహేష్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తే ఆ రేంజ్ ఊహించతరమా ! ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ అమాంతం పెరుగుతుంది . మరి మహేష్ కృష్ణ పాత్ర చేస్తాడా ? లేక చివరి నిమిషంలో రిజెక్ట్ చేస్తాడా ? చూడాలి .
English Title: Mahesh babu to do play as krishna in NTR biopic?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ddn0re
Comments
Post a Comment