పుల్ జోరు మీద శరభ
డాక్టర్ జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ కుమార్, మిష్టి చక్రవర్తి జంటగా ఎకెయస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై యన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న శరభ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 15 న విడుదల కు సిద్ధమయింది.
ఈ సినిమా పబ్లి సిటీలో భాగంగా ఈ రోజు ఆంధ్రజ్యోతి .. నమస్తే తెలంగాణా పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ లు వేయడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ఆ రెండు పత్రికలతో పాటు సాక్షి పత్రికలో కూడా మంచి యాడ్ వేయడం జరిగింది.. ప్రస్తుతం సినిమా పరిశ్రమ అంతా ఈ సినిమా వైపు చూస్తున్న ఈ సినిమా వివరాలను ఒక సారి పరిశీలిద్దాము ..
జయప్రద దశావతారం సినిమా తరువాత నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.. ఆమె తన కెరియర్ లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రను పోషించింది. అలాగే తమిళ నటుడు నెపోలియన్ నాగార్జున హలో బ్రదర్ సినిమా తరువాత ఈ సినిమాలో వైవిధ్యమైన విలన్ గా నటిస్తున్నాడు. అలాగే నటుడు నాజర్ … మెరుపు కలలు తరువాత ఈ సినిమాలో ఒక హాస్య పాత్ర పోషించడం విశేషం యల్. బి. శ్రీరామ్ ఒక వైవిధ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో ని పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నయన్. నరసింహారావు గతంలో తమిళ నటుడు శంకర్ వద్ద అపరచితుడు సినిమా నుండి శివాజీ,,రోబో,, ఐ చిత్రాల వరకు దర్శకత్వ శాఖలో పని చేశాడు . తదనంతరం దిల్ రాజు కంపెనీలో స్టోరీ విభాగంలో కొంత కాలం పని చేశాడు.
దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది చందమామ కథల తరహాలో అందరికి తెలిసిన విధంగా అందరూ ఆసక్తి గా చూసే విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ .. నిర్మాత సినిమా మీద మోజుతో దుబాయ్ నుండి వచ్చారు.. సినిమాకు అవసరమయ్యే విధంగా కర్చుకు వెనకాడ కుండా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ సినిమా 40 నిముషాల సీజీ వర్క్ ఉంటుంది. దాదాపు 12662 షాట్స్ సీజీ లో చేశాము. నేను ఐ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పుడు ఆ సినిమాకు మేకప్ ఇన్ ఛార్జ్ అయిన న్యూ.జిల్యాండ్ కు చెందిన షాన్ ఫుట్ అనే మేకప్ మ్యాన్ ఈ సినిమాకు ప్రాస్త టిక్ మేకప్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ హీరో నరసింహ స్వామి అవతారం ఎత్తుతాడు ఆ వర్క్ కోసం ఆయన చాలా కాలం వెయిట్ చేశారు.. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EUUfBA
Comments
Post a Comment