సర్కార్ కథ కాపీ అని తేలిపోయింది

vijay's Sarkar story issue settledవిజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్ర కథ నాది అంటూ వరుణ్ రాజేంద్రన్ దర్శకులు మురుగదాస్ మీద కోర్టు కి వెళ్ళాడు , అయితే నిన్న మొన్నటి వరకు అతడు తప్పు చేస్తున్నాడు ఆ కథ నాదే అంటూ చెప్పుకొచ్చిన మురుగదాస్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం వరుణ్ రాజేంద్రన్ తో రాజీ కుదుర్చుకొని పేరు వేయడానికి అలాగే డబ్బులు ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నాడు . దాంతో గొడవ సద్దుమణిగింది కాబట్టి సర్కార్ విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . ఇంకేముంది సర్కార్ నవంబర్ 6 న విడుదలకు మార్గం సుగమం అయ్యింది .

దర్శకులు మురుగదాస్ మీద ఇంతకుముందు కూడా కాపీ కథలు అంటూ ప్రచారం సాగింది . కత్తి సినిమా నరసింహారావు అనే వ్యక్తీ రాసుకుంటే ఎంచక్కా కొట్టేసాడు . అయితే తమిలంలో అతడికి న్యాయం జరగలేదు కానీ తెలుగులో రీమేక్ చేసినప్పుడు మాత్రం దాసరి నారాయణరావు జోక్యం చేసుకొని అతడికి న్యాయం జరిగేలా చేసాడు . ఇక ఇప్పుడేమో వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టు ని ఆశ్రయించడంతో చివరి నిమిషంలో రాజీ కుదుర్చుకున్నాడు మురుగదాస్ . అంటే కథ కాపీ కొట్టానని స్వయంగా ఒప్పుకున్నట్లే కదా !

English Title: vijay’s sarkar story issue settled



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AzrE0m

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly