పాపం ! విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ టైం బాగుందని అనుకుంటున్న సమయంలో టాక్సీ వాలా సినిమా మొత్తం లీకై హల్చల్ చేస్తోంది. గీత గోవిందం సినిమాతో పాటుగా టాక్సీ వాలా కూడా లీకైంది . గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే లీక్ కాగా టాక్సీ వాలా మాత్రం మొత్తం సినిమా లీకైంది. అయితే సినిమా మొత్తం రీ రికార్డింగ్ పూర్తిచేసుకున్న సినిమా మాత్రం కాదు. మొత్తం నాలుగు గంటల సినిమానట లీకైంది. ఇంకేముంది టాక్సీ వాలా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురి దగ్గర ఈ సినిమా చేరిపోయింది. మొబైల్ ఫోన్ లలో ఆ సినిమాని చూసుకుంటున్నారట .
అసలే విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇలా టాక్సీ వాలా మొత్తం పైరసి బారిన పడటంతో పాటుగా గ్రాఫిక్స్ కారణంగా నాలుగు నెలలుగా విడుదలకు నోచుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ ఏకంగా నాలుగు నెలలు పూర్తయ్యాయి , ఐదో నెల లో అడుగుపెట్టింది . ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదా ? అన్న అనుమానం నెలకొంది. ఇటీవలే గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నోటా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
English Title: Vijay devarakonda taxiwala leaked
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NS7Cqb
Comments
Post a Comment