కేసీఆర్ కు చుక్కలు చూపిస్తానంటున్న కొండా సురేఖ
వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎం ఎల్ ఏ కొండా సురేఖ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో టీఆర్ఎస్ గెలవకుండా ముప్పుతిప్పలు పెడతానని ముఖ్యంగా వర్ధన్నపేట , పాలకుర్తి , వరంగల్ ఈస్ట్ లతో పాటుగా పరకాల , భూపాలపల్లి లలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తానని తద్వారా కేసీఆర్ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తానని శపథం చేస్తోంది కొండా సురేఖ. వరంగల్ ఈస్ట్ ఎం ఎల్ ఏ గా టీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహించింది కొండా సురేఖ కానీ తాజాగా మాత్రం ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించడంతో కేసీఆర్ ,కేటీఆర్ లపై నిప్పులు చేరుగుతూ రచ్చ రచ్చ చేసింది.
మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ దంపతులు ఈసారి కేసీఆర్ ని టార్గెట్ చేశారు. అధికార మదంతో కేసీఆర్ కు కేటీఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయని వాటిని కిందకు దించుతామని సవాల్ చేస్తోంది కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి బలం ఉంది దాంతో ప్రతీ నియోజకవర్గ పరిధిలో ఎంత వీలైతే అంత వ్యతిరేక ప్రచారం చేయాలని కసిగా ఉన్నారు కొండా దంపతులు. కొండా సురేఖ వల్ల టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో భారీ మొత్తంలో దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో నష్టపోవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కొండా సురేఖ , కొండా సురేఖ దంపతులు, కొండా మురళి , కేసీఆర్ , కేటీఆర్ , తెలంగాణ రాష్ట్ర సమితి , టీఆర్ఎస్ , వరంగల్ జిల్లా , అసెంబ్లీ ఎన్నికలు , వరంగల్ ఈస్ట్ , పాలకుర్తి , పరకాల , భూపాలపల్లి , వర్ధన్నపేట , పొలిటికల్ న్యూస్ ,
English title: Konda surekha challenges kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2y1e7fn
Comments
Post a Comment