సెటైర్ వేసిన విజయ్ దేవరకొండ
తమిళనాడు సెన్సార్ సభ్యులు మా నోటా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారని మరి మన తెలుగు సెన్సార్ సభ్యులు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో అని సెటైర్లు వేసాడు హీరో విజయ్ దేవరకొండ. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం.
అక్టోబర్ 5 న సినిమా విడుదలకు సిద్ధం అవుతుండటంతో తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయతే ఏ సర్టిఫికెట్ ఇస్తారో ? యు బై ఏ ఇస్తారేమో అని భయపడితే యు సర్టిఫికెట్ ఇచ్చారట తమిళ సెన్సార్ సభ్యులు దాంతో తెలుగువాళ్లు ఏ సర్టిఫికెట్ ఇస్తారేమో అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ట్వీట్ చేసి ఆసక్తిని పెంచాడు విజయ్ దేవరకొండ. మరి మన తెలుగు సెన్సార్ బోర్డ్ ఎటువంటి కట్స్ చెబుతుందో ? ఏ సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలి.
English Title: Vijay Devarakonda satire on Telugu Censor Board
We go U
Even I voted A.
Let’s see what my favourite Telugu Censorboard will give me 🤔#MaranaWaiting https://t.co/TBDNMnfo2a— Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zEeVsJ
Comments
Post a Comment