మహేష్ బావ ఆ సినిమా ఎందుకు రిజెక్ట్ చేసాడంటే

Sudheer babu rejected bollywood filmటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు ఇటీవలే నన్ను దోచుకుందువటే చిత్రంతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా విజయం సాధించాడు అయితే పూర్తిస్థాయి విజయం కాకపోయినా ప్లాప్ కాలేదు పైగా హిట్ టాక్ కూడా వచ్చిన చిత్రం కాబట్టి సుధీర్ బాబు హీరోగా నిర్మాతగా రెండు విధాలుగా సక్సెస్ కొట్టునట్లే ! నన్ను దోచుకుందువటే సక్సెస్ తో సంతోషంగా ఉన్న సుధీర్ కు బాలీవుడ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో విలన్ గా నటించమని సుధీర్ ని కోరారట అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు సుధీర్ బాబు .

పెద్ద బ్యానర్ , పైగా మల్టీస్టారర్ చిత్రం అందునా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్న చిత్రం అయినప్పటికీ సుధీర్ బాబు విలన్ గా నటించడానికి ఒప్పుకోలేదు. ఇంతకుముందు భాగీ చిత్రంలో విలన్ గా నటించాడు కూడా కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడో తెలుసా …….. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం వల్లే ! బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు సుధీర్ పైగా బాలీవుడ్ లో కూడా రూపొందుతోంది ఈ బయోపిక్ దాంతో బ్రహ్మాస్త్ర కు బయోపిక్ కు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నందున బాలీవుడ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు సుధీర్ బాబు .

English Title: Sudheer babu rejected bollywood film



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nak9Qt

Comments

Popular posts from this blog