కేసీఆర్ అంతు చూస్తానంటున్న రేవంత్ , సంపత్

Revanth reddy and sampath fires on kcrకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతు చూస్తామని ప్రతిన బూనారు కాంగ్రెస్ తాజా మాజీ ఎం ఎల్ ఏ లు రేవంత్ రెడ్డి , సంపత్ లు. వేరు వేరుగా ఈ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసహనంతో ఊగిపోతున్నాడని , వచ్చే ఎన్నికల్లో ఒడిపోతాననే భయం పట్టుకుందని అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పడుతున్నారని అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేసారు రేవంత్ రెడ్డి , సంపత్ లు.

శాసనసభలో స్పీకర్ పై దాడి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా సంపత్ ల శాసన సభ్యత్వంని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో సంపత్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటే మొదటి నుండి కెసిఆర్ అండ్ కో కు పడటం లేదు దాంతో అతడ్ని ఎలాగైనా సరే జైలుకి పంపాలని చూసినప్పటికి రేవంత్ మాత్రం వెన్ను చూపకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా రేవంత్ ఇంట్లో ఐటీ అధికారులతో పాటుగా ఈడీ అధికారులు కూడా రైడ్ చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో రేవంత్ కూడా చాలా కసిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ని జైల్లో పెడతామని అంటున్నారు.

English Title: Revanth reddy and sampath fires on kcr



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DHinHj

Comments

Popular posts from this blog