బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరో తెలుసా

Is kaushal Bigg boss 2 winner ?బిగ్ బాస్ 2 తుది దశకు చేరుకుంది దాంతో బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరు ? అన్న ఉత్సుకత నెలకొంది అందరిలో. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ విన్నర్ కౌశల్ అని తెలుస్తోంది. అయితే కౌశల్ విన్నర్ అని తెలుస్తున్నప్పటికి అధికారికంగా తెలిసే వరకు మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అయినట్లు గా కొన్ని ఫోటోలు లీక్ కావడంతో అదే నిజమని తెలుస్తోంది అలాగే కౌశల్ కు భారీ ఎత్తున ఓట్లు వచ్చి పడుతున్నాయి దాని వెనుక కౌశల్ ఆర్మీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

కౌశల్ ఆర్మీ గతకొద్ది రోజులుగా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యింది. అసలు ఒకదశలో బిగ్ బాస్ నే శాసించే స్థాయికి చేరుకుంది కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ తో పాటుగా తనీష్ , గీతా మాధురి, దీప్తి , సామ్రాట్ లున్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విన్నర్ అన్నది అధికారికంగా తేలాల్సి ఉన్నప్పటికీ కౌశల్ విన్నర్ అని మాత్రం లీకులు అందుతున్నాయి. 112 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ 2 కి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది.

English Title: Is kaushal Bigg boss 2 winner



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IqfKbx

Comments

Popular posts from this blog