నాగశౌర్య @ నర్తనశాల ప్లాప్

ఈఏడాది మొదట్లో నటించిన ఛలో సూపర్ హిట్ కావడంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో @ నర్తనశాల చిత్రం చేసాడు , ఈరోజే ఆ సినిమా విడుదల అయ్యింది అయితే నర్తనశాల అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు . దాంతో నాగశౌర్య @ నర్తనశాల తో ప్లాప్ మూటగట్టుకున్నట్లైంది . అసలు ఈ సినిమా టైటిల్ తో సినిమా తీయాలని చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేసారు కానీ ఏవి కూడా వర్కౌట్ కాలేదు కట్ చేస్తే అది బ్యాడ్ సెంటిమెంట్ గా భావించి టైటిల్ కి ముందు @ చేర్చి @ నర్తనశాల గా విడుదల చేసారు .

ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . కొత్త దర్శకుడు కొత్త పాయింట్ తో సినిమా తెరకెక్కించాడు కానీ సెకండాఫ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేదు దాంతో నాగశౌర్య ఆశలు గల్లంతయ్యాయి . పైగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నా సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి , నచ్చకపోతే ఎక్కువ మందికి చెప్పండి నచ్చలేదని అని అన్నాడు విడుదలకు ముందు ఇప్పుడు అదే అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే . ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను నీరసపడేలా చేస్తోంది దాంతో బాబోయ్ ! అంటూ తల పట్టుకుంటున్నారు ప్రేక్షకులు .

English Title: Flop talk to nagashourya @Narthanasala



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MXrUgL

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly