లేడీ డైరెక్టర్ బి జయ మృతి

lady director b jaya passed awayలేడీ డైరెక్టర్ బి . జయ (54) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బి . జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది . మొన్ననే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించగా తాజాగా లేడీ డైరెక్టర్ బి. జయ చనిపోవడం శోచనీయం . బి . జయ చంటిగాడు , లవ్లీ , గుండమ్మ గారి మనవడు ,ప్రేమికులు , సవాల్ , వైశాఖం చిత్రాలకు దర్శకత్వం వహించింది . పాత్రికేయురాలిగా కెరీర్ ని ప్రారంభించిన జయ సూపర్ హిట్ పత్రికని విజయవంతంగా నడిపించింది .

ప్రముఖ పీఆర్ఓ బి ఏ రాజు సతీమణి బి జయ దాంతో సినీ పాత్రికేయ బృందం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది . తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించింది బి. జయ . తన సతీమణి విగతజీవిగా మారడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు బీఏ రాజు .

English Title: lady director b jaya passed away



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wBWn9K

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly