మణికర్ణిక ఈ లొల్లేంది
బాలీవుడ్ లో రూపొందుతున్న మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రానికి క్రిష్ దర్శకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ క్లాప్ బోర్డ్ సంచలనం సృష్టించింది . ఇంతకీ ఆ క్లాప్ బోర్డ్ లో ఏముందో తెలుసా …… …. మణికర్ణిక చిత్రానికి దర్శకులు కంగనా రనౌత్ అని . ఇంకేముంది అది వైరల్ గా మారింది. ఈ విషయం కంగనా రనౌత్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించింది మణికర్ణిక చిత్రానికి దర్శకులు క్రిష్ అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ గా ఉంది కాబట్టి ఆ ప్యాచ్ వర్క్ ని క్రిష్ అనుమతితో నేనే దర్శకత్వం వహించాను అంటూ అసలు విషయాన్ని చెప్పింది కంగనా .
వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ పూర్తిచేసాడు అయితే కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దర్శకులు క్రిష్ అలాగే కంగనా రనౌత్ .ఆ సమయంలోనే క్రిష్ కు కంగనా కు గొడవలు అయ్యాయని వార్తలు వచ్చాయి అయితే అవన్నీ గాలివార్తలే అని కంగనా మాత్రమే బదులిచ్చింది కానీ క్రిష్ ఇంతవరకు నోరు మెదపలేదు కట్ చేస్తే ప్యాచ్ వర్క్ కంగనా దర్శకత్వంలో పూర్తవుతోంది దానికి తోడు దర్శకురాలు కంగనా రనౌత్ అని క్లాప్ బోర్డ్ లోని టైటిల్స్ లో ఉండటంతో క్రిష్ ని తప్పించారా ? అన్న అనుమానం నెలకొంది . కానీ కంగనా చెబుతున్న దాని ప్రకారం క్రిష్ స్థానం క్రిష్ దే ! ప్రస్తుతం క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ గా ఉన్నాడు .వచ్చే ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అలాగే మణికర్ణిక కూడా వచ్చే ఏడాది జనవరిలోనే విడుదల కానుండటం విశేషం .
English Title: director Krish facing problem with manikarnika
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nz2Fyj
Comments
Post a Comment