సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయిన హరికృష్ణ

behind the reason of nandamuri harikrishna deathనందమూరి హరికృష్ణ కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కానీ అదే డ్రైవింగ్ హరికృష్ణ పాలిట మృత్యువు అయ్యింది . తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ కు చేదోడు వాదోడు గా ఉంటూ చైతన్య రథం కు రథసారధి అయ్యాడు హరికృష్ణ . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పదవులకోసం పాకులాడలేదు , అయితే తాజా సంఘటనలో హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయాడని నిర్దారణకు వచ్చారు . సీటు బెల్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటో మరోసారి హరికృష్ణ సంఘటన రుజువు చేసింది . గతంలోకూడా హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో మృతువాత పడ్డాడు కాగా ఇప్పుడేమో హరికృష్ణ కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందాడు .

సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ఎయిర్ బెలూన్ తెరుచుకునేది దాని వల్ల గాయాలతో హరికృష్ణ బయటపడేవాడు , ప్రాణాలతో ఉండేవాడు కానీ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో యావత్ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం నెలకొంది . సీటు బెల్ట్ పెట్టుకోవాలని , హెల్మెట్ లు పెట్టుకోవాలని పదేపదే ప్రచారం చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు దాని ఫలితంగా ఇలా దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి .

English Title: behind the reason of nandamuri harikrishna death



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Phc7XC

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly