ఆ ఇద్దరు కూడా విజయవాడ హైవే పైనే చనిపోయారు
నందమూరి హరికృష్ణ అలాగే ఆయన తనయుడు నందమూరి జానకిరామ్ కూడా విజయవాడ హైవే పైనే చనిపోవడం అది కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అంతేకాదు ఇద్దరు కూడా డ్రైవింగ్ చేస్తూ మృత్యువాత పడటం శోచనీయం . 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ స్వయంగా కారు నడుపుకుంటూ వేగంగా వెళ్తూ ఎదురుగ వస్తున్న ట్రాక్టర్ ని తప్పించబోయి మృత్యువాత పడ్డాడు కాగా ఆ సంఘటనలో కూడా జానకిరామ్ సీటు బెల్ట్ పెట్టుకోలేదు , ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే జానకిరామ్ గాయాలతో బయటపడేవాడేమో !
ఇక ఈరోజు జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో కూడా నందమూరి హరికృష్ణ అత్యంత వేగంతో 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం ఒక కారణమైతే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం మరో కారణం అయ్యింది . లేదంటే ఈ సంఘటనలో కూడా హరికృష్ణ బయటపడే వాడేమో ! తండ్రీ కొడుకులు ఇద్దరు కూడా విజయవాడ హైవే మీద అది కూడా నల్లగొండ జిల్లా లో చనిపోవడం అత్యంత దురదృష్టకరం . రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణం తో నందమూరి కుటుంబం మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు విషాదంలో మునిగారు .
English Title: vijayavada highway :bad sentiment for ntr family
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Lv1Wwh
Comments
Post a Comment