అక్టోబర్ 18న విజయదశమి కానుకగా మాస్ హీరో విశాల్ ‘పందెం కోడి 2’
మాస్ హీరో విశాల్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెంకోడి 2’. గతంలో మాస్ హీరో విశాల్, ఎన్.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్ డూపర్ హిట్ అయి విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గురువారం విడుదల చేశారు. ఆగస్ట్ 31న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు తెలిపారు.
మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nvnbjg
Comments
Post a Comment